Tuesday, August 18, 2026
HomeTelanganaమంత్రి గంగులను పరామర్శించిన బండి సంజయ్

మంత్రి గంగులను పరామర్శించిన బండి సంజయ్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర మరియు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (85) ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకొని శుక్రవారం రాత్రి తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్ళి, మల్లయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ ను పరామర్శించారు. మల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణా రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పోరేటర్లు పెద్దపల్లి జితేందర్, కచ్చు రవి, కొలగాని శ్రీనివాస్, బండ రమణ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, తదితరులు వున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.