మంచిర్యాల జిల్లా: నేరాలను నియంత్రించడంలో భాగంగా క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పగటి పూట చోరీలు ఎక్కువయ్యాయి. రామకృష్ణాపూర్ తో పాటు పులిమడుగు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయడం లేదు. వెంటనే వాటిని మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు..

