Telugu Updates
Logo
Natyam ad

పశువుల దొంగలు హల్చల్..?

 

మంచిర్యాల టూ దేవపూర్ అడ్డగ మార్చిన పశువుల దొంగలు

దేవపూర్ పరిసర ప్రాంత ప్రజలు పారాహుషార్

అర్థరాత్రి దేవాపుర్ లో దొంగల ముఠా..!

దేవపుర్ నుండి మంచిర్యాల కు చెందిన ఓ కళ్యాణి హోటల్ కు దొంగ అవుల మాసం సరఫరా

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన  పశువు దొంగలు రూటు మార్చారు.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే పలు థానల్లో కేసులు నమోదు అవుతుండడంతో దేవాపుర్ కేంద్రంగా రూటు మార్చారు. దేవాపుర్ కు చెందిన ఓ పశువుల  వ్యాపరితో పరిచయం చేసుకొని దేవపూర్ పరిసర ప్రాంతాల్లో అభం శుభం తెలియని రైతుల అవులను దొంగలించి మంచిర్యాల కు చెందిన మాసం షాపులకు రైల్వే స్టేషన్ ప్రాంతంలోని కళ్యాణి హోటల్ కు సరఫర చేస్తున్నట్లు సమాచారం. దేవాపుర్ చెందిన వ్యక్తి పరిసర ప్రాంతానికి చెందిన ఓ సర్పంచ్ పరిచయంతో దొంగ పశువులకు రసీదులు రాస్తున్నట్లు సమాచారం. కొంత మంది పట్టణ ముస్లిం ప్రజలు ఇది తప్పు అని చెబుతున్న స్థానికంగా కొంత మంది ఓ మాజీ కౌన్సిలర్ సహకరిస్తున్నాట్లు సమాచారం. బక్రీద్ పండుగ కంటే వారం క్రితం గోపాల్ వాడకు చెందిన అవును కోస్తున్న క్రమంలో యజమాని పట్టుకోవడంతో దొంగల వ్యవహారం మరోసారి బట్టబయలైంది.

మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసునమోదు అయిన దొంగల వ్యవహారం ఆగడంలేదు. స్థానిక వార్డ్ నాయకులు దొంగలకు సహకరిస్తున్నారు అని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల క్రితం తిలక్ నగర్ కు చెందిన వ్యక్తి గొర్రె దొంగలించగ అతనికి దొంగల గురించి తెలవడంతో దొంగలు అతని 10వెలు రూపాయిలు ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకి పొక్కలేదు. గత బక్రీద్ సమయంలో స్వయాన మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఓ అవును పట్టిన సందర్బాలు సైతం ఉన్నాయి..