భారత్ పై మిసైల్ దాడికి పాక్ పన్నాగం..!
ఆంజనేయులు న్యూస్: భారత్ కు చెందిన ఓ మిసైల్ పొరపాటు ఫైర్ అయి, పాక్ భూభాగంలో ఇటీవల పడింది. ఇది పొరపాటుగా మాత్రమే జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని భారత్ స్పష్టతనిచ్చింది. అయితే సాంకేతిక వైఫల్యమన్న భారత్ వాదనను పాక్ ఒప్పుకోలేదు. ఆ సమయంలో భారత్ పై పాక్ మిసైల్ దాడికి యత్నించిందని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. దీనికి పాకిస్తాన్ పక్కా ప్లాన్ వేసిందని తెలుస్తోంది. అయితే భారత్ కు మద్దతుగా అమెరికా స్పందించింది. అది పొరపాటుగా జరిగిందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 9న పంజాబ్లోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్థావరంలో తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ మిసైల్ పొరపాటు గాల్లోకి లేచింది. అది పాక్ భూభాగంలోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఓ ఇంటి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదు. ఇది కేవలం సాంకేతిక లోపమేనని చెప్పినా భారత్ వాదనను పాక్ నమ్మలేదు. నానా యాగీ చేసినా ఆ దేశానికి మద్దతుగా ఏ దేశమై స్పందించలేదు.