హైదరాబాద్: ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కు రిమాండ్ విధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ వద్ద ధర్నా ఘటనలో పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కేసు మోపారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్లపై 18 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని 14 రోజుల పాటు రిమాండు తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు వీసీ ఛాంబర్ను ముట్టడించారు..