Telugu Updates
Logo
Natyam ad

నూతన సిఐ గా విద్యాసాగర్ బాధ్యతలు స్వీకరణ

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ రూరల్ నూతన సిఐగా సిహెచ్ విద్యాసాగర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టిన ఆయనకు కోటపల్లి ఎస్సై రవికుమార్, నీల్వాయి ఎస్సై నరేష్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ చెన్నూర్ రూరల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు..