మంచిర్యాల జిల్లా, చెన్నూరు: పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమరిస్తే చట్టపరమైన కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సిఐ నాగరాజు హెచ్చరించారు. నీల్వాయిలో గురువారం సాయంత్రం నకిలీ పత్తి విత్తనాలు, పంట పొలాల్లో కరెంటు తీగల ఏర్పాటుతో కలిగే నష్టం, సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నకిలీ విత్తనాల సరఫరా, రవాణా, నిల్వ చేసి అమ్మినా కఠిన చర్యలు తప్పవన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జి. నరేష్, గ్రామ పెద్ద లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు