
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గత సంవత్సరం ఆన్ లైన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, జవహర్ లాల్ నెహ్రూ సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు గురువారం మంచిర్యాల డిఇఓ వెంకటేశ్వర్లు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా విజ్ఞాన గనిగా ఎన్నో నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారుతోందన్నారు. నవంబర్ లో జరిగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థులు సన్నద్ధమై జాతీయ స్థాయిలో రాణించేలా ప్రదర్శనలు తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, జిజ్ఞాస బృందం శ్యామ్, సంపత్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

