మంచిర్యాల జిల్లా: ఎసిసి అంబేద్కర్ కాలనీ లో నాలుగో సెక్టార్ అంగన్వాడి టీచర్ కే. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆట, పాటలతో కూడిన విద్య తో పాటు పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించేలా అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్ని ఇండ్లల్లో అంగన్వాడి వచ్చే వయస్సు పిల్లల అందరిని గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రంలో పేర్లు నమోదు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అదేవిధంగా సామాజిక భాగ్యస్థానం తో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అంగన్వాడి కేంద్రం నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఇంటింటికి తిరిగి బడిబాట కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్య క్రమంలో కౌసర్, ఆసంపల్లి, లావణ్య, ఎం. అనసూర్య, ఆర్ పి చంద్రకళ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.