Telugu Updates
Logo
Natyam ad

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..!

మంచిర్యాల  జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసి అంబేద్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ స్మారక సంఘం నాయకులు పాల్గొన్నారు..