రామగుండం సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
రామగుండం: పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సిపి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నెల 1 నుండి జూలై 1 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే డీజే, డ్రోన్ లపై కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.