Telugu Updates
Logo
Natyam ad

తయారీ రంగానికి అడ్డాగా హైదరాబాద్: కేటీఆర్

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషనల్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్ లో ఉన్నాయని.. ఇమేజ్ టవర్స్ సైతం నగరంలో నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. నగరంలో ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్ కు (Johnson Controls) చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు..