Telugu Updates
Logo
Natyam ad

మద్యంలో యాసిడ్ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మద్యం మత్తులో నీళ్లు అనుకొని యాసిడ్ ను కలుపుకొని తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్(29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గత నెల 18న మద్యం మత్తులో మంచినీరు అనుకొని యాసిడ్ బాటిల్ లొనీ యాసిడ్ ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించి అతడి కుటుంబసభ్యులు కరీంనగర్ లొనీ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతిచెందినట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయకుమార్ తెలిపారు. మహేశ్ కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..