Telugu Updates
Logo
Natyam ad

ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలి.

మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ SRP 3 మైన్ ను సందర్శించి గేట్ మీటింగ్ లో పాల్గొన్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి గారు హాజరై మాట్లాడుతూ…SRP 3మైన్ లో స్థానిక సమస్యలు పరిష్కరించాలి. అదే విదంగా ఈ మైన్ లో కృష్ణారెడ్డి అనే కార్మికుడు మైన్ లో పనిచేస్తూ 10-11-2021 రోజున ఫ్యాటల్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు నలుగురిలో ఇతను కూడా చనిపోయాడు.అతని కుమారుడైన శ్రీనివాసరెడ్డికి తండ్రి చనిపోయేనాటికి 35 సంవత్సరాల 2 నెలలు వయసు ఉన్నది.రెండు నెలలు ఎక్కువగా ఉన్న కారణం చేత ఉద్యోగం రాదని సింగరేణి అధికారులు చెబుతున్నారు.ఉద్యోగం ఇవ్వకపోతే అతని యొక్క కుటుంబం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.ఫ్యాటల్ ఆక్సిడెంట్ చనిపోయిన వారికి ఈ చిన్న విషయాన్ని చూపి ఉద్యోగం ఇవ్వకపోవడం వలన చాలా అన్యాయం జరుగుతున్నది.కావున దయచేసి కృష్ణరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి ఉద్యోగం అవకాశం కల్పించి, అతని కుటుంబాన్ని ఆడుకోవాలని లేకపోతె రాబోయే రోజుల్లో SRP 3 లో ఆందోళన కార్యక్రమలకు పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్,సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ మేనేజర్ మీడివెల్లి శంకర్, శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజు, ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.