పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు
ఆంజనేయులు న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ గ్రామంలోని స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించాడు. బిల్లు కోసం వెంకటేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బిల్లు మంజూరు చేయడానికి సీనియర్ అసిస్టెంట్ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావుకు 7000 డబ్బులు ఇస్తుండగా సోమవారం అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.