Tuesday, November 17, 2026
HomeTelanganaగ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సేవలందిస్తున్న ఏకైక సంస్థ వాసవిక్లబ్స్

గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సేవలందిస్తున్న ఏకైక సంస్థ వాసవిక్లబ్స్

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, నవంబర్ 16, ( ఆంజనేయులు న్యూస్ )

గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిరుపేదలకు అండగా నిలుస్తూ వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆ సంస్థ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు, కార్యాలయ మరియు మెంబర్‌షిప్ గ్రోత్ ఛైర్మన్ పాత సుదర్శన్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల శ్రీనివాస గార్డెన్స్‌లో జిల్లా 107 గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుల్లూరీస్ 9వ డిస్ట్రిక్ట్ డిస్కాన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత సుదర్శన్ మాట్లాడుతూ.. జిల్లా 107 పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో 47 వాసవిక్లబ్స్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభ్యులు అనుకోకుండా మరణించిన నిరుపేద కుటుంబాలకు మహాప్రస్థానం ద్వారా రూ.25 వేల ఆర్థిక సాయం, నిరుపేద ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేల సాయం, చిరువ్యాపారులకు వడ్డీలేని రూ.25 వేల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. సరస్వతి పథకం ద్వారా నిరుపేద విద్యార్థులకు లక్ష నోటుపుస్తకాలు అందించడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా శాశ్వత సేవా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏడాది పాటు విశేష సేవలందించిన వాసవిక్లబ్ సభ్యులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు. 2027 సంవత్సరానికి నూతన గవర్నర్‌గా ఎన్నికైన పబ్బ అరుణతో పాటు ఆమె క్యాబినెట్ బృందంతో ప్రస్తుత గవర్నర్ బాలమోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అబ్జర్వర్ సుగ్గుల ప్రసన్నకుమార్, కాన్ఫరెన్స్ ఛైర్మన్ ముక్తా శ్రీనివాస్, ఎన్నికల అధికారి కొండ చంద్రశేఖర్, అంతర్జాతీయ అధికారులు సిరిపురం రాజేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, ఎకిరాల శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, బాల సంతోష్, జంధ్యం మాధవి, జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, నూతన గవర్నర్ పబ్బ అరుణ, క్యాబినెట్ అధికారులు, రీజియన్, జోన్ ఛైర్మన్లు, జిల్లా అధికారులు, వివిధ క్లబ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.