Saturday, October 17, 2026
HomeTelanganaమంచిర్యాలవైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు!

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు!

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ యువతకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ విజ్ఞప్తి

మంచిర్యాల అక్టోబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ )

వైద్య ఆరోగ్య శాఖలో ప్రకటించిన ఉద్యోగ నియామకాల పేరుతో నిరుద్యోగ యువత మోసపోవద్దని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చే మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామక ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే జిల్లా ఎంపిక కమిటీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ–DSC) ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని తెలిపారు. నిర్దేశిత మెరిట్‌, రోస్టర్‌ విధానం ఆధారంగా నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా హామీ ఇచ్చినా, సిఫార్సులు చేస్తామని చెప్పినా నమ్మవద్దని, డబ్బులు డిమాండ్‌ చేసే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని సూచించారు. నియామక ప్రక్రియలో డబ్బులు, సిఫార్సులు లేదా ఇతర ప్రలోభాలకు చోటు లేదని పేర్కొన్నారు. ఇలాంటి మోసపూరిత హామీలను నమ్మడం వల్ల నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అధికారిక సమాచారం, ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ కోరారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మీ ప్రతిభే మీ అర్హత.. మీ మెరిటే మీ ఎంపిక. మోసపూరిత హామీలకు దూరంగా ఉండండి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.