వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు!

నిరుద్యోగ యువతకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ విజ్ఞప్తి మంచిర్యాల అక్టోబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ ) వైద్య ఆరోగ్య శాఖలో ప్రకటించిన ఉద్యోగ నియామకాల పేరుతో నిరుద్యోగ యువత మోసపోవద్దని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చే మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామక ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే జిల్లా ఎంపిక కమిటీ (డిస్ట్రిక్ట్‌...