Sunday, September 6, 2026
HomeTelanganaకార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారిన పాఠశాల

📰 Generate e-Paper Clip

మంచిర్యాల సెప్టెంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప, ఇతర సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు తమ గురువుల పట్ల ప్రేమాభిమానాలను, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు, సిస్టర్స్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యాబోధనతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, మానవీయతను విద్యార్థుల్లో పెంపొందించడం ఉపాధ్యాయుల గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ సాగిన ఈ వేడుకలు గురువుల సేవలను, త్యాగాలను గౌరవించేలా నిలిచాయి. ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమం మధురమైన జ్ఞాపకంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.