కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మంచిర్యాల సెప్టెంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప, ఇతర సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు తమ గురువుల పట్ల ప్రేమాభిమానాలను, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు, సిస్టర్స్ అభినందనలు...