Monday, August 10, 2026
HomeTelanganaజర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా కొమ్ము రాజేష్

జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా కొమ్ము రాజేష్

📰 Generate e-Paper Clip

వాస్తవ గమ్యం’ ఎడిటర్‌కు కీలక బాధ్యతలు

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా: రాజేష్

మంచిర్యాల, ఆగస్టు 10, ( ఆంజనేయులు న్యూస్ )

జర్నలిస్ట్ సంక్షేమ సంఘం (జె.ఎస్.ఎస్.) ట్రేడ్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ‘వాస్తవ గమ్యం’ ఎడిటర్ కొమ్ము రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు, ప్రతినిధులు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేస్తూనే జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని సంఘం నాయకులు కొనియాడారు. కొమ్ము రాజేష్ నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జె.ఎస్.ఎస్. ట్రేడ్ యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు వారి హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ కొమ్ము రాజేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి, తనను అభినందించిన జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూనియన్‌ను విస్తరించేందుకు, జర్నలిస్టులు మరియు కార్మికుల హక్కుల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.