Monday, August 17, 2026
HomeTelanganaపర్ధాన్ తెగకు గౌరవ వేతనం ఇవ్వాలి

పర్ధాన్ తెగకు గౌరవ వేతనం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

పలు డిమాండ్లు చేసిన సంఘం నాయకులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఎలక్ట్రికల్ యూనియన్ సంఘం భవనంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో పర్ధాన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలు కీలక డిమాండ్లు ప్రభుత్వానికి వినిపించారు.. మసీదుల్లో పనిచేసే మౌలాలు, దేవాలయాల్లో పనిచేసే పూజారులకు ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తున్నట్లే, షెడ్యూల్ తెగలోని (కిక్రి) వాయించి పెన్ కరుణ్, పెన్ పూజలు చేసే వారికి కూడా గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పర్ధాన్ తెగను (PVTG) జాబితాలో చేర్చాలని, GO MS No.3 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అర్హులైన పర్ధాన్ తెగకు చెందిన గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే భూమిలేని నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని, వెనుకబడిన పర్ధాన్ తెగకు చెందిన నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గేడాం తులసిరామ్, ప్రధాన కార్యదర్శి అడ వెంకటేష్, గౌరవ అధ్యక్షుడు కుర్సింగ్ జంగు, ఆదివాసీ పర్ధాన్ పురోహిత సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడావి శంకర్, జాయింట్ సెక్రటరీ ఆత్రం ప్రహ్లాద్, ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.