
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావును శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ స్థానాల్లో, లక్షెట్టీపేట్ మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజలు పార్టీకి పూర్తి మద్దతు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
