Monday, August 17, 2026
HomeTelanganaబాసరలో వసంత పంచమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు

బాసరలో వసంత పంచమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు

📰 Generate e-Paper Clip

జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: బాసరలో జరగనున్న వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా బాసర ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న జిఎస్.గార్డెన్ లో బుధవారం ఆపోలీసు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. వసంత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున,ఆలయ పరిసర ప్రాంతాల్లో, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేకంగా పోలీసు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా బారికేడింగ్, క్యూలైన్లు, పార్కింగ్ ఏర్పాట్లు, లడ్డు కౌంటర్ల వద్ద రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ముందుగానే సిద్ధం చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, సాదా దుస్తుల్లో పోలీసులు, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.