Friday, July 3, 2026
HomeTelanganaబాగున్నరా.. అమ్మ!.. కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

బాగున్నరా.. అమ్మ!.. కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

📰 Generate e-Paper Clip

రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.

Post Midle

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా… తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.