Monday, August 17, 2026
HomeTelanganaఅనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం

అనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం

📰 Generate e-Paper Clip

తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం

200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ములుగు జిల్లా: మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను, సాండ్ స్టోన్ బొమ్మల లిపి చిత్రాలను, క్యూ లైన్ నిర్మాణ పనులను, గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణ పనులను, ఆలయ ఫ్లోరింగ్ పనులను చిలుకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్.టి.సి. బస్ స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రి ధనుసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి పరిశీలించారు. మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ పనులు, రాత్రి నిర్మాణ పనులు డిసెంబర్ 31వ తేదీ లోపు, ఇతర పనులు జనవరి 5వ తేదీ లోపు పూర్తి పూర్తిచేయాలని సంబంధిత అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. ప్రధాన ద్వారం పనులు కూడా జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని అధికారులు చిత్తశుద్ధితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలచే పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, తక్కువ సమయంలో 100 శాతం పని చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. చిన్న చిన్న అవాంతరాలు కలుగుతున్నప్పటికీ వచ్చే సంవత్సరం జనవరి 5 వ తేదీలోగా పనులు పూర్తి అవుతాయని తెలియజేశారు..

ఫోటో గ్యాలరీ:

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.