మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని నస్పూర్ మండలం, తాళ్లపల్లి ప్లాట్స్, ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన కర్రు సందీప్ అనే వ్యక్తి చిన్నారుల అసబ్యకరమైన వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.. తప్పిపోయిన & దోపిడీకి గురైన పిల్లల జాతీయ కేంద్రం (NCME) మరియు సైబర్ సెక్యూరిటీ, తెలంగాణ వారి ఆదేశానుసారం నస్పూర్ పోలీస్ వారు సైబర్ చట్టం కింద కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్ ఈ కేసు ను దర్యాప్తు చేసి చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియా లో పంపిన వ్యక్తిని ఆదారాలతో సహా పట్టుకున్నారు… అనంతరం సిఐ మాట్లాడుతూ.. ఎవరైనా అంతర్జాలంలో చిన్నారుల అసభ్యకరమైన వీడియోల గురించి వెతికినా, సోషల్ మీడియా( వాట్స్ అప్, ఇన్స్టాగ్రాo, టెలిగ్రాం ఇతర సామాజిక మాధ్యమాలు) లో షేర్ చేసినా వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్ తో నస్పూర్ సబ్ -ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఉపేందర్ రావు పాల్గోన్నారు..


