
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమితులైన తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ని గురువారం హైదరాబాద్ సోమాజిగూడ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగ కలసి ఘనంగా సన్మానించిన మంచిర్యాల జిల్లా కళాకారులు.. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని, మీ రచనలు, పాటలు, ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపజేస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ సహాయసాకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసానిచ్చారు. నిరుద్యోగ కళాకారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్ మరియు సభ్యులు రామగిరి అర్జున్, అడ్లగురి లక్ష్మణ్, ఎల్పుల రమేష్ బాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు..
