బిజెపి పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఎగ్గిన సాయి, ఈడిదినేని హరీష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ ప్రీమియర్ లీగ్ ఎన్.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.. ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా బిజెపి పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ హాజరై ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని అనంతరం టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు సన్మార్గంలో నడవాలని నేటి ఆధునిక యుగంలో అనేక మంది యువత మద్యం, గంజాయి మరియు డ్రగ్స్ కు మరియు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై తమ జీవితాలతో పాటు తమ తల్లిదండ్రులు కన్న కలలను కూడా నాశనం చేస్తున్నారని అలాకాకుండా యువత చెడు వ్యసనాలకు బానిస అవకుండా క్రీడలు మరియు చదువు పట్ల దృష్టి సారించి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..
