Tuesday, August 18, 2026
HomeCrimeమైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు

📰 Generate e-Paper Clip

అదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా 295 మైనర్ లు నడిపిన వాహనాలను వారం రోజులపాటు తాత్కాలికంగా జప్తు చేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందజేసిన తర్వాత నిన్న రాత్రి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు, ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇద్దరు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తండ్రులపై వేరువేరుగా రెండు కేసులు నమోదు చేయబడ్డాయని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు 17 సంవత్సరాల మైనర్ యువకునికి తండ్రి వేణుగోపాల్ పై ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో 125 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం క్రైమ్ నెంబర్ 224/25 తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు నర్సయ్య, తన కొడుకు 12 సంవత్సరాల వ్యక్తికి వాహనాన్ని ఇచ్చి నందున పొచ్చర గ్రామం వద్ద వాహనాన్ని సీజ్ చేసి ఇచ్చిన తండ్రి నరసయ్య పై 125 బి ఎన్ ఎస్ సెక్షన్ ప్రకారం క్రైమ్ నెంబర్ 138/25తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన, నిబంధన అతిక్రమించి మైనర్లకు వాహనాలను ఇచ్చి న తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అవుతున్నారని అదేవిధంగా ప్రమాదాలకు గురి చేస్తున్నారని విషయాన్ని గమనించి తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా ఉండాలని సూచించారు. మైనర్లు అర్హత వచ్చేంతవరకు ఆగి వాహన లైసెన్స్ ను పొందిన తర్వాత వాహనాలు నడపాలని లేనియెడల తల్లిదండ్రులపై అనవసరంగా కేసులు నమోదు అవుతున్నాయి అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.