Tuesday, August 18, 2026
HomeTelanganaఎమ్మెల్యే ను బద్నాం చేయడానికి అసత్యపు ఆరోపణలు

ఎమ్మెల్యే ను బద్నాం చేయడానికి అసత్యపు ఆరోపణలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో హజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామంలో ప్రభుత్వ ఫించన్ తీసుకున్న లభ్డిదారులు స్వచ్చందంగా ఇంటి పన్ను చెల్లిస్తే బీజేపీ, బీఆరెస్ రాద్ధాంతం చేయడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేంపల్లి మాజీ సర్పంచ్ డేగ బాపు, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి  నంనూర్ ఘటన వాస్తవాలను వివరించారు. గత నెలలో  ప్రభుత్వం మంజూరు చేసిన ఫించన్ డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వగా ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయని గ్రామ కార్యదర్శి చెప్పడంతో వెంటనే ఇంటి పన్ను చెల్లించారని తెలిపారు. గత నెలలో ఘటన జరిగితే రెండు రోజుల నుంచి ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును బద్ నామ్ చేయడానికి బీజేపీ, బీఆరెస్ కుట్ర చేశాయని ఆరోపించారు. ఎమ్మెల్యే దృష్టికి రావడంతో గ్రామ అధికారిని  సస్పెండ్ చేస్తూ విచారణ జరపాలని డీఆర్ డీ ఏ అధికారులను ఆదేశించారని తెలిపారు. విచారణలో ఒక్కరు మాత్రమే  గ్రామ అధికారికి వ్యతిరేకంగా చెప్పగా మిగతా వాళ్ళు తామే స్వచ్చందంగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించామని తెలిపారని చెప్పారు. గ్రామ అధికారులు గ్రామ పంచాయతీ అభివృద్ధి, నిర్వహణలో భాగంగా ఇంటి పన్ను బకాయిల గురుంచి ప్రస్తావించారని అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కొంత మంది గ్రామాధికారులపై తప్పుడు పనులు చేయాలని ఒత్తిడి తెచ్చినా చేయకపోవడం వల్ల కక్షకట్టి గత నెల లో జరిగిన విషయాన్ని ఈనెలలో వెలుగులోకి తేవడం దురుద్దేశపూరితం కాదా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతిని సహించరని ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలుస్తారని అన్నారు.

ముఖ్యంగా రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించరని అందుకు ఉదాహరణ గత ప్రభుత్వంలో తరుగు పేరుతో దళారులు దోచుకుంటే ఎమ్మెల్యే కాగానే తరుగు పేరు లేకుండా చేశారని గుర్తు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు , అభివృద్ధి పనులు ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాడని అన్నారు. ఇవన్నీ గిట్టని విపక్షాలు ఎమ్మెల్యే ను బద్నాం చేయడానికి అసత్యపు ఆరోపణలు కుట్రపూరిత  చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. విపక్షాలకు ప్రజల్లో ఆదరణ లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.