Monday, August 17, 2026
HomeTelanganaనల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది.

నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించారు. కాంట్రాక్టర్ ఇవ్వాలిసిన యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వడంలేదు. ప్రతి నెల చెల్లించాలిసిన  వేతనాలు, పీఫ్, ఈఎస్.ఐ సక్రమంగా చెల్లించడం లేదు. ఇప్పటికే 6 నెలలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. సిబ్బంది పట్ల కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలి. ప్రతి నెల వేతనాలు పీఫ్ ఈఎస్.ఐ చెల్లించాలి. లేకుంటే ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ మల్లీశ్వరి జానకి చంద్రకళ విజయ తిరుమల మంగ శ్రీకాంత్ షేక్ ఇబ్రహీం అన్వర్ మాధవి పద్మ దేవేంద్ర మెహరిన్ శేఖర్ చంద్రమౌళి సందీప్  దీప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.