Tuesday, August 18, 2026
HomeTelanganaప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

📰 Generate e-Paper Clip

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మతసామరస్యం సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, ఐజి అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో  4253 లో మంచిర్యాల జోన్ పరిధిలో -1981, పెద్దపెల్లి జోన్ పరిధిలో 2272 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామని, నిమజ్జన సమయంలో  ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి రోజు విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం, బ్లూ క్లోట్స్, పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుంది అన్నారు.

సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్ర  రావు, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, సిసిఎస్ ఏసిపి వెంకటస్వామి, ఏ ఆర్ ఏసిపి ప్రతాప్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.