Tuesday, August 18, 2026
HomeTelanganaపార్కులలో విచ్చలవిడిగా మద్యపానం

పార్కులలో విచ్చలవిడిగా మద్యపానం

📰 Generate e-Paper Clip

పట్టించుకోని సంబంధిత అధికారులు

ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పాత మంచిర్యాలలో అందరికీ ఆహ్లాదం పంచుతున్న మున్సిపల్ పార్క్ లో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో విచ్చల విడిగా మద్యం, కూల్ డ్రింక్స్ సేవించి బాటిల్ లను అక్కడే పడేసి పోతున్నారు. దీంతో ఇక్కడ క్రమంగా బాటిల్స్ వ్యర్ధాలు జమ అవుతున్నాయని తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ టిజిఎఫ్డిసి మంచిర్యాల రేంజ్, ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పార్క్ లో మద్య పానం నిషేధించాలని. ఈ పార్క్ మనందరిదీ. దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాద్యత మన పైనే ఉంది. మంచిర్యాల పేరు లోనే మంచి ఉంది.. అలాంటి మంచి మంచిర్యాల పేరు ను కొందరు వ్యక్తులు చెడగొడుతున్నారు. మద్యం తాగడానికి బార్లు ఉన్నాయి. లేదంటే ఇంటికి తీసికెళ్లి తాగండి. పాత మంచిర్యాల పార్క్ ఒక్కటే కాదు. పట్టణంలో బహిరంగ మైదాన ప్రాంతాలైన జెడ్పీఎచ్ఎస్ మైదానం, ప్రభుత్వ డిగ్రీ పాఠశాల మైదానం, ఇలా కొన్ని చోట్ల అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికయినా మంచిర్యాల లోని మంచిని అలవర్చుకొని బుద్దిగా నడుచుకుంటూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించివద్దని కోరుతున్నాము. మీ జీవితం లో ఎదుగుదలకు సహాయమయ్యే కబుర్లను మీ స్నేహితులతో పంచుకోండి.. కానీ ఇలా చేయకండి.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ పార్క్ పై దృష్టి సారించి ప్లాస్టిక్, మద్యం బాటిల్స్ ను తొలగించి ఇక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే చాలా మందికి ఆహ్లాదం పంచుతూ ప్రయోజనకరంగా ఉంటుంది అని అన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.