Tuesday, August 18, 2026
HomeTelanganaఆంజనేయులు న్యూస్ వార్తకు స్పందించిన మంచిర్యాల మున్సిపాలిటీ విభాగం

ఆంజనేయులు న్యూస్ వార్తకు స్పందించిన మంచిర్యాల మున్సిపాలిటీ విభాగం

📰 Generate e-Paper Clip

పాత మంచిర్యాల పార్క్ లో మద్యం, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరివేత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పాత మంచిర్యాల, లక్ష్మి నగర్ లో ఉన్న పార్క్ గురించి పార్కులో విచ్చలవిడిగా మద్యం “మందుబాబులకు అడ్డాగా మున్సిపల్ పార్క్” అని “ఆంజనేయులు న్యూస్ వెబ్సైట్ లో వచ్చిన వార్త కు మున్సిపల్ విభాగం వారు స్పందించారు. మంగళవారం ఈ పార్క్ కు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వచ్చి పార్క్ లో పడేసి ఉన్న మద్యం, కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిల్స్ ఇతర ప్లాస్టిక్ వ్యర్థ వస్తువులను తొలగించి చెత్త వాహనం లో బయటికి తరలించారు. ఈ సందర్బంగా మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పారిశుధ్య సిబ్బంది వారికి పార్క్ లో నడకకు వచ్చేవారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్క్ లో మద్య పానం సేవించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణ తో పాటు మరికొన్ని పూలమొక్కలు, ఖాళీ మట్టి ప్రదేశంలో కూర్చోడానికి వీలుగా పచ్చని గడ్డి ని పెంచి మరింత అందంగా తీర్చి దిద్దితే ఈ పార్క్ అందరికీ మరింత ఆహ్లాదం పంచుతుంది అని పార్కు కు వచ్చే వాకర్సు తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.