Monday, August 17, 2026
HomeTelanganaఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫిబ్రవరి 16వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం, కార్యవర్గ ఎన్నిక సంబంధిత రాష్ట్ర శాఖ ఉత్తర్వులను జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, కార్యదర్శి డా॥ సాగి అనిల్కుమార్, వైస్ల్చెర్మన్ చందూరి మహేందర్తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వార్షిక సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం గల పోషకులు, ఉప పోషకులు, జీవిత సభ్యులు, జీవిత సహచరులతో ఫిబ్రవరి 16న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వార్షిక సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయిన శాశ్వత సభ్యత్వం పొందిన వారు తమ రెడ్ క్రాస్ గుర్తింపు కార్డు / ఆధార్ కార్డు / ఓటరు గుర్తింపు / డ్రైవింగ్ లైసెన్స్ / ఇతర ఫోటో గుర్తింపు కార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. సభ్యత్వం పొందిన వారి చిరునామా వివరాలలో మార్పులపై ప్రత్యేకంగా ఫోన్ చేసి సమాచారం సేకరించడం జరిగిందని, ఇతరు సభ్యులు చిరునామాలో మార్పులు కావాలనుకునే వారు తమ వివరాలను తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గల రెడ్ క్రాస్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కమిటి సభ్యులు వ్యాసభట్ రాధాక్రిష్ణ, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, జిల్లా కమిటి సభ్యులు మధుసూదన్రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, సత్యపాల్ రెడ్డి, ఎడ్ల కిషన్, నాగేందర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.