Tuesday, August 18, 2026
HomeTelanganaగ్రీన్ వుడ్ పాఠశాల పై మహిళలల ఆగ్రహం

గ్రీన్ వుడ్ పాఠశాల పై మహిళలల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాల బస్సులు రోడ్లపై దుమ్ము లేపుతూ కాలనీ వాసులకు ఇబ్బంది గురిచేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన కాలనీ మహిళలు బస్సులను రోడ్లపై ఆపి పాఠశాల ప్రిన్సిపాల్ ను నిలదీశారు. తమ కాలనీలో నిత్యం ఉదయం సాయంత్రం బస్సులు వెళుతూ ఇరుకైన సందులలో మట్టి రోడ్డుపై దుమ్ము లేపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని. ఈ దుమ్ము వలన మాకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. స్కూల్ యాజమాన్యం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని ధర్నా చేశారు. అనంతరం యాజమాన్యం వచ్చి కాలనీవాసులకు సముదాయించిన వినలేదు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి అధిక ఆదాయం ఉన్న తొమ్మిదవ వార్డు రోడ్లు లేకపోవడం ఇక్కడి కౌన్సిలర్ చేతకానితనం మల్లి ఇది జరుగుతుందని విమర్శించారు. పోలీసులు రంగా ప్రవేశం చేశాక గొడవ సద్దుమణిగింది. మహిళలకు ఖచ్చితమైన హామీ ఇవ్వకపోతే స్కూల్ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.