Monday, August 17, 2026
HomeCrimeప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి ఆర్.డి.ఓ. పి.హరికృష్ణ

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎవరైనా ఇండ్ల నిర్మాణం చేపట్టినా ఇతరాత్రా వాడుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హరికృష్ణ అన్నారు. బెల్లంపల్లి డివిజన్ లోని తహసిల్దార్లు, ఎంపీడీవోలు,  ఎంపీఓలు, మున్సిపల్ సిబ్బంది,  డివిజనల్ పంచాయతీ అధికారి మరియు పోలీస్ శాఖ వారితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చాలా చోట్ల ప్రభుత్వం భూమి కబ్జాలకు గురి అవుతుందని తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్.డి.ఓ. అన్నారు. ప్రభుత్వ భూములలో రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారితో కలిపి సర్వే కూడా నిర్వహిస్తున్నామని అక్రమ నిర్మాణాలు జరిగితే చర్యలు చేపడతామని అన్నారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే ఆ ఇంటి నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులను, మెస్త్రీలను బైండోవర్ చేయడం జరుగుతుందని ఆర్.డి.ఓ. అన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఫణీంధర్ రావు డివిజన్ లోని తహశీల్దార్లు సుధాకర్, రోహిత్, దత్తు ప్రసాద్, ఇమ్రాన్ ఖాన్, బికర్ణదాస్ , సదానందం, ఎంపీడీవోలు,  ఎంపీఓలు, రూరల్ సిఐ రాజ్ కుమార్, ఆర్ డి.ఓ ఆఫీస్  డీఎవో శ్రీనివాసరావు దేశ్ పాండే,  మున్సిపల్ కమిషనర్ భుజంగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.