Monday, August 17, 2026
HomeTelanganaచెన్నూర్ లో అందరి నోట కాంగ్రెస్ మాట

చెన్నూర్ లో అందరి నోట కాంగ్రెస్ మాట

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మందమరి పట్టణంలో స్థానిక 13 వ వార్డులో గజ్జెల నరేష్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి  చేతుల మీదుగా  కాంగ్రేస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ. కాకా వెంకటస్వామి తన జీవితం ప్రజల కోసమే బ్రతుకుతూ తెలంగాణ సాధనలో మా కుటుంబ పాత్ర , కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. చెన్నూరు అభివృద్ధి అనునది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు ఇట్టి విషయాన్ని విస్మరించరాదని కచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేసి గత పాలకులకు బుద్ధి చెప్పాలని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.