Monday, August 17, 2026
HomeTelanganaఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ఇతరత్రా కార్యక్రమాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములుతో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వినియోగించనున్న వివిధ అంశాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అందించిన ధరలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల, 10వ తేదీ నామినేషన్ సమర్పించేందుకు ఆఖరు తేది అని, 13న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. లౌడ్ స్పీకర్లు, ఆంప్లిఫయర్, మైక్రోఫోన్, నిర్ణీత కొలతలతో పోడియం నిర్మాణం, క్లాత్ బ్యానర్లు, ఫ్లాగ్స్, ప్లాస్టిక్ ఫ్లాగ్స్, హాండ్ బిల్స్, పోస్టర్లు, హోర్డింగ్స్, కట్ అవుట్స్ (వుడెన్ & క్లాత్ / ప్లాస్టిక్, వీడియో కాసెట్స్ / డి.వి.డి. కన్వర్షన్, ఆడియో కాసెట్స్, కమానాల ఏర్పాటు, ఇంధనం మినహాయించి రోజు వారి వాహనాల కిరాయి, హోటల్ / అతిథి గృహాల కిరాయి, డ్రైవర్ల కిరాయి, ఫర్నీచర్ (కుర్చీలు, సోఫా ఇతరత్రా) కిరాయి, పురపాలక సంఘాల పరిధిలో హోర్డింగ్ సైట్స్ కిరాయి, కార్యాలయం, మైదానం కిరాయి, ఫంక్షన్ హాల్, బల్క్ ఎస్.ఎం.ఎస్., వాయిస్ రికార్డింగ్, సాధారణ ఖర్చులకు సంబంధించి వివిధ విభాగాలు, రకాలకు భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ధరలు నిర్ణయించడం జరిగిందని, ఈ ధరలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.