Tuesday, August 18, 2026
HomeTelangana"మీ అందరి భద్రతే మా లక్ష్యం": సీపీ రెమా రాజేశ్వరి

“మీ అందరి భద్రతే మా లక్ష్యం”: సీపీ రెమా రాజేశ్వరి

📰 Generate e-Paper Clip

మహిళకు అండగా రామగుండం కమిషనరేట్ పోలీస్ భరోసా

ప్రయాణికుల, మహిళ భద్రత కొరకు “అభయ అప్లికేషన్”

రామగుండం సిపి రెమా రాజేశ్వరి

ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పారిశ్రామిక ప్రాంతం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త కళాశాలలు, స్కూల్స్, పరిశ్రమలు, కంపెనీ ల ఏర్పాటుతో జనాభా సంఖ్య పెరుగుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఎక్కువ మంది మహిళలు, ఉద్యోగం చేసేవారు, గృహిణి లు తమ తమ అవసరాలను, పనుల కోసం ఎక్కువగా ఆటోలలో ప్రయాణం చేస్తుంటారు కావున శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల రక్షణకై రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో మహిళలకు అత్యవసర సమయాల్లో, రాత్రి పగటిపూట ప్రయాణాల్లో  ఆటోలు, క్యాబ్లో ప్రయాణించే వారు భద్రతకు భరోసా కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ మీ భద్రతే మా లక్ష్యం’ అనే నినాదం తో “అభయ (సేఫ్ ఆటో) మొబైల్ అప్లికేషన్ ను  రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్. అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు సురక్షితంగా, పూర్తి రక్షణ తో ప్రయాణించేందుకు ఈ యాప్ ను ఆవిష్కరించడం జరిగిందని ఆపద సమయంలో అభయ్ యాప్ ను సద్వినియోగం చేసుకొని జరగబోయే ప్రమాదాలు నివారించవచ్చని, ప్రయాణ సమయాల్లో ఆకతాయిగా వ్యవహరించే డ్రైవర్ల ఆటకట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో. వాహనాలకు క్యూ ఆర్ తో కూడిన యూనిక్ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌తో మహిళల భద్రతకు భరోసా కలుగుతుందని సీపీ గారు అన్నారు. మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికులను ఆటో డ్రైవర్లు తప్పదోవ పట్టించిన, మార్గం మళ్లించిన అసభ్యంగా ప్రవర్తించిన, మద్యం తాగి వాహనం నడిపిన, నిబంధన విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకున్న, రాష్ డ్రైవింగ్ చేసినట్లు అనిపించిన వెంటనే మీ మొబైల్ ఫోన్ లో అభయ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆయా వాహనాల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి. వెంటనే మీరు ప్రయాణిస్తున్న వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుతుంది. వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వాహనాన్ని ట్రేస్ చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆకతాయిల పని పడతారు ఇలా జరగబోయే నేరాలను కట్టడి చేయడంలో ఈ అప్లికేషన్స్ కీలకంగా పనిచేస్తుంది. ఇట్టి ఆధునిక సాంకేతిక క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల డ్రైవర్లు తప్పు చేసేందుకు సైతం భయపడతారు అదేవిధంగా ప్రయాణికులకు సైతం సురక్షితంగా గమనించి స్థానాలకు చేర్చమని నమ్మకం కలుగుతుందన్నారు.ఈ యాప్ ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల, మహిళల భద్రత విషయంలో  కీలకమైన క్యూఆర్‌ కోడ్‌ను ఆటోవాలాలు పక్కాగా వినియోగించేలా చర్యల్ని తీసుకోవడం జరుగుతుంది. ఆటో నంబరుతో పాటు వాహన చోదకుడికి సంబంధించిన పూర్తి వివరాలను అనుసంధానించిన క్యూఆర్‌ కోడ్‌ను అందచేయడం జరిగింది. ఆటోవాలాలు వాటిని తమ సీటు వెనుకభాగంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచనలు చేశారు.

• క్యూఆర్ కోడ్/యూనిక్ నెంబర్ ఇవ్వడం వలన ఉపయోగాలు

Q.R. Code (క్విక్ రెస్పాన్స్) విధానంలో   ఆటో యజమాని/డ్రైవర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.

ఆ వాహనం యొక్క పూర్తి వివరాలు స్థానిక పోలిస్ స్టేషన్ కి మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయబడి ఉంటాయి.

ఆటో లో డ్రైవర్ కి వెనుక భాగంలో క్యూ ఆర్ కోడ్/యూనిక్ నెంబర్  బోర్డు అమర్చడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు క్యూ ఆర్ కోడ్ స్కానర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాహనం ఎక్కే ముందు ప్రయాణికులు డిజిటల్ బోర్డ్ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే ఆటో యజమాని/డ్రైవర్ యొక్క వివరాలు రావడం జరుగుతుంది.

ఇందులో అత్యవసర కాల్/టెక్స్ట్ మెసేజ్ పంపడం, ట్రేస్ మై లొకేషన్, , ఎమర్జెన్సీ కంప్లైంట్, రేటింగ్ అంశాలు ఉంటాయి.

ప్రయాణికులకు ఆపద సంభవిస్తుంది అనుకునే సమయంలో కాల్ చేస్తే కమాండ్ కంట్రోల్ రూమ్ కి మరియు స్థానిక పోలీస్ స్టేషన్ కి వారి లైవ్ లోకేషన్ మరియు సమాచారం వెళుతుంది.

వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆపదలో ఉన్న వారిని రక్షించడం జరుగుతుంది.

మద్యం సేవించి వాహనం నడిపిన, రాష్ డ్రైవింగ్ చేసిన, ప్రయాణికులతో దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించిన, సెల్ ఫోన్ డ్రైవింగ్, స్మోకింగ్ చేస్తూ వాహనం నడిపిన, రాంగ్ రూట్ లోడ్రైవింగ్ చేసిన, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొనిన, అనుమానస్పదంగా వ్యవహరించిన ఆకతాయి డ్రైవర్ల ఆటకట్టించవచ్చును.

ప్రయాణీకులు వారి వస్తువులను వాహనం లో మరిచిపోయిన ఈ విధానం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చును..

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్, మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్, అడిషనల్ డీసీపీ ఏ ఆర్  రియాజ్ హుల్ హాక్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, జైపూర్ ఎసిపి మోహన్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్ సి ఎస్ సి పి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఈవో నాగమణి, ఏ ఆర్ ఏసిపిలు సుందర్రావు, మల్లికార్జున్ ఇన్స్పెక్టర్ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.