
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న భారత అథ్లెటిక్స్ శిబిరానికి మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థి జి. నాగసాయి ఎంపికైంది. ఈ నెల 20 నుండి జూలై 5వ తేదీ వరకు భోపాల్ లో జరగనున్న శిబిరంలో నాగసాయి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రిన్సీ, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ టిస్సీ, కోచ్ అండ్ పీఈటీ అనిల్ అభినందించారు..
