Tuesday, August 18, 2026
HomeCrimeజగిత్యాల రూరల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి

జగిత్యాల రూరల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: ఆర్. టి. సి బస్సులో ప్రయాణిస్తున్న ముస్లీం విద్యార్థినిని జగిత్యాల బస్సు డిపో వద్ద ఈమె ప్రమాణిస్తున్న బస్సు ఎదురుగా పోలీస్ వాహనం అడ్డం పెట్టి బస్సులోనికి అక్రమంగా ప్రవేశించి ఈ విద్యార్థిని పట్ల అమర్యాదకరంగా బాధ్యత రహితంగా కొట్టి అందరి ముందు అవమానకర పరచిన జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేయాలని మైనారిటీ నాయకులు బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల టౌన్ ఇతని పరిది కాకున్న బస్సును అడ్డగించి బస్సు బస్టాండ్ వరకు వెళ్ళె దాక కూడ ఓపిక పట్టకుండ ఒక బాలికపై దౌర్జన్యం చేసిన రూరల్ ఎస్ఐని విధుల నుండి తొలగించి సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.