Monday, August 17, 2026
HomeTelanganaపాల ప్యాకెట్ ను చూసి కంగుతిన్న ప్రజలు

పాల ప్యాకెట్ ను చూసి కంగుతిన్న ప్రజలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పాల ప్యాకెట్ పై షాపింగ్ మాల్ ఆఫర్స్ తో ఉన్న స్టిక్కర్ లను చూసి ప్రజలు కంగుతిన్న ఘటన మంచిర్యాలలో జరిగింది. ఆంజనేయులు న్యూస్ వెబ్ సైట్ కథనం ద్వారా వివరాల్లోకి వెళ్తే మంచిర్యాలలోని షాపింగ్ మాల్ తమ షాప్ లో పెట్టిన ఆఫర్స్ ని పబ్లిసిటీ చేసేందుకు కొత్త రకమైన ప్రయోగాన్ని చేశారు. అందులో భాగంగానే ప్రతిరోజు మంచిర్యాలకు వచ్చే కరీంనగర్ డైరీ పాల ప్యాకెట్ సప్లై ఏజెంట్ లతో కలిసి పాల ప్యాకెట్ కు వెనుకాల స్టిక్కర్ అంటించి వాటిని పట్టణంలో చిన్నచిన్న షాప్ లకు చేశారు. అన్ని ఆ షాప్ లో పాల ప్యాకెట్ కొన్న వినియోగదారులు అదిచూసి షాక్ అయ్యారు. ఇది చూసిన పలువురు పాల ప్యాకెట్ ల నిర్వాహకులు కరీంనగర్ డైలీ పాల సంస్థకు ఫోన్ చేసి ప్రశ్నించగా మాకు తెలియకుండా జరిగింది. మా అనుమతి లేకుండా అక్కడి ఏజెంట్ లు అల చేశారని, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూస్తామని బదులు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.