Monday, August 17, 2026
HomeTelanganaఎమ్మెల్యే ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఎమ్మెల్యే ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఎండీ. ఇసాక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బెదిరిస్తూ మెసేజ్ లు పెట్టాడు. నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. ప్రగతి భవన్ కు వెళ్లి మీ వీడియోలు చూపిస్తామని మెసేజ్ లో పేర్కొన్నాడు. రూ. 90 వేలు పంపితే వాటిని బయటపెట్టమని, సైలెంట్ గా ఉంటామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఎండీ ఇసాక్ గా గుర్తించారు. అతన్ని గురువారం పట్టుకుని కేసు నమోదు చేశారు. యువకుడి వెనుక ఎవరన్న ఉన్నారా.? వేరే వారి ప్రోత్సాహం, సహకారం ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.