
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఇంట్లో చలిమంట నిప్పు అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బెల్లంపల్లి పట్టణం 24 డిప్ ఏరియాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దురిశెట్టి శాలవ్వ (75) తన మనుమడు సంపత్ తో కలిసి గుడిసెలో నివాసం ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇంట్లోనే మంట కాచుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది. వన్ టౌన్ సీఐ ముష్కే రాజు, ఎస్సై సంతోష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
