Monday, August 17, 2026
HomeTelanganaఅక్రమ వెంచర్లపై కొరడా ఝలిపించిన అధికారులు

అక్రమ వెంచర్లపై కొరడా ఝలిపించిన అధికారులు

📰 Generate e-Paper Clip

మిడి మిడి జ్ఞానం తో వెంచర్ లు వేస్తున్నా రియల్టర్లు

నాలుగు రోజులయితే మరచి పోతారులే అని సర్ది చేప్పే మాటలు

అసైన్డ్, లావుని భూములకు లక్షల రూపాయలు ఇచ్చి మోస  పోతున్న అమాయక ప్రజలు

చదువు రాకున్న  భూదందాలతో  లక్షలు గడిస్తూన్న రియల్టర్లు

భూ యజమానులు ప్లేక్సిలు చింపడంతో  ఐరన్ రాడ్ లతో బోర్డులు ట్రాక్టర్ తో ట్రెంచ్ ఎర్పాటు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ లో ఎలాంటి అనుమతి లేకుండా వెలిసిన వెంచర్ లను మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్  మధుసూదన్ నాయక్ , అడిషనల్ కలెక్టర్ రాహుల్  ఆకస్మికంగా పర్యటించి ప్లాట్ హద్దు రాళ్లను తొలగించారు. గ్రామంలో ఎక్కడైనా కానీ  DTCP అనుమతి, నాలా అనుమతి, మరియు వెంచర్ యొక్క ప్లాన్ నక్ష మొదలైన  పత్రములు ఉండి గ్రామ పంచాయతీ నుండి అనుమతి  ఉన్న వెంచర్ లలో మాత్రమె ప్లాట్ కొనుగోలు చేయాలనీ, అలాంటి వాటికి మాత్రమే ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుందని, అనుమతి లేని వెంచర్ లలో ప్లాట్ కొని మోసపోవద్దని తెలిపారు. అనుమతి లేని వెంచర్ లలో భూమి అమ్మకం, కొనుగోలు చట్ట రీత్యా నేరం అని, వారి పై తగు చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంటన తాండూర్ తహశీల్దార్ కవిత , ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ సత్యనారాయణ  గీర్దావర్ ,తాండూర్ పంచాయతీ కార్యదర్శి తపాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.