Tuesday, August 18, 2026
HomeTelanganaఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన

ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన

📰 Generate e-Paper Clip

రెబ్బెన పిఏసిఎస్, వైస్ చైర్మన్ రంగు మహేష్

ఆంజనేయులు న్యూస్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదినం సందర్భంగా కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల్ పిఏసిఎస్, వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తాండూర్ మండలంలోని సేవా జ్యోతి అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగు మహేష్ గౌడ్ మాట్లాడుతూ. ఎమ్మెల్సీ పుట్టినరోజు పురస్కరించుకొని తనవంతు సహాయంగా ఆశ్రమానికి 50 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశామని. అదేవిధంగా ఎమ్మెల్సీ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు మరింత సేవ చేసే ఆరోగ్యాలు ప్రసాదించాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కస్తూరి మహేష్, మరియు తాండూరు మండల యూత్ ఉపాధ్యక్షులు మంతెన శివకృష్ణ మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.