Tuesday, August 18, 2026
HomeTelanganaజాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం

జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఎంవీ రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు మంచిర్యాల పట్టణంలో “సౌత్ ఇండియన్ బ్యాంక్” నందు బ్యాంకు స్కీమ్స్ పై జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సైబర్ మోసాలపై బ్యాంకులో ఎలాంటి ఫిర్యాదులకైన, ఆధార్ లింక్ ను బ్యాంకులో అప్డేట్ కోసం మరియు బ్యాంక్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ 14448 కి కాల్ చేయలని, మరియు అదే విధంగా సైబర్ మోసాల కు టోల్ ఫ్రీ నెంబర్ 19304 కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకొని పొందవలసినదిగా అని ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎల్డీఎం మైపాల్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, బ్యాంక్ స్టాఫ్ సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు, మరియు కాళాజాత కార్యకర్తలు విజయ్ మెజీషియన్, చిరంజీవి డప్పు ప్లేయర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.