Tuesday, August 18, 2026
HomeTelanganaఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం పకడ్బంధీగా చేపట్టాలి.

ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం పకడ్బంధీగా చేపట్టాలి.

📰 Generate e-Paper Clip

ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2023లో భాగంగా జిల్లాలో 18సం॥లు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు, జాబితా సవరణ ప్రక్రియలను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బంధీగా చేపట్టాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2023లో భాగంగా జిల్లాలో 18సం॥లు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు, జాబితా సవరణ ప్రక్రియలను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో విడుదల అయిన డ్రాఫ్ట్ ఓటరు జాబిబాలో అభ్యంతరాలు, నూతన ఓటరు

నమోదు దరఖాస్తులను నవంబర్ 9 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో, బూత్ స్థాయి అధికారి, తహశీల్దార్ కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని, ఇట్టి దరఖాస్తులను డిసెంబర్ 9వ తేదీ నుండి 26వ తేదీ లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

గతంలో జనవరి 1వ తేదీని నూతన ఓటరు నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరిగేదని, ఇప్పుడు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్.ఎస్.ఆర్.-2023లో భాగంగా స్వీప్ కార్యకలాపాలు చేపట్టేందుకు సంబంధిత ఎ.ఈ.ఆర్.ఓ.లు కార్యచరణ రూపొందించాలని, పోలింగ్ కేంద్రాలలో జనాభా నిష్పత్తి ప్రకారంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల అధికారులు, స్వీప్ నోడల్ అధికారులు, నోడల్ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ జిల్లాలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 18 సం||ల నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటరు జాబితా తయారులో రాజకీయ పార్టీల ఏజెంట్ల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదు, సవరణలు, ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ప్రధాన బస్స్టేషన్లలో ఆడియో ప్రసారాలు చేయాలని, పురపాలక సంఘాల పరిధిలో హోర్డింగ్లను ప్రదర్శించాలని, పురపాలక సంఘాల పరిధిలో ఆస్తి పన్నుకు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్లకు సందేశాలు పంపించాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్ళలో అందరికీ తెలిసే ప్రదర్శనలు నిర్వహించాలని, ఆటో ద్వారా ఆడియా ప్రసారాలు చేయాలని తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ! నూతన ఓటరు నమోదు, సవరణలు అవసరమున్న వారికి సంబంధిత ఫారములు అందించి, నింపిన తరువాత తిరిగి సేకరించే విధంగా బూత్ స్థాయి అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నెల 21న స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కార్యచరణ అమలు చేసే విధంగా శిక్షణ అందించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులచే ప్రతి వారం చునావ్ పాఠశాల కార్యక్రమం నిర్వహించాలని,

ఈ కార్యక్రమంపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి కార్యక్రమం వివరాలతో నిర్దేశిత ఫార్మాట్లో నివేదిక తయారు చేసి అందించాలని, గ్రామాలలో ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల వద్ద సంబంధిత గోడప్రతుల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2023 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.